దర్శకురాలి పాత్రలో కొరియోగ్రాఫర్‌ తార

హైదరాబాద్‌ : ప్రముఖ కొరియోగ్రాఫర్‌ తార దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. శ్రీ చౌడేశ్వరీ దేవీ పిక్చర్స్‌ పతాకంపై రాజ్‌కుమార్‌ కథానాయకుడుగా ‘బారిష్టర్‌ శంకర్‌ నారాయణ్‌’ అనే సినిమాకు ఆమె దర్శకత్యం వహిస్తున్నారు. ఈ సినిమా లోగోను పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈరోజు ప్రసాద్‌ ల్యాబ్‌లో అవిష్కరించారు. ప్రేమ, హాస్యం ప్రధానంగా సాగే ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.