దళారులను నమ్మి మోసపోవద్దు

మార్కెట్లలోనే పంటలు విక్రయించాలి

విజయవాడ,నవంబర్‌25 (జనంసాక్షి) : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని వ్యవసాయశాఖ మంత్రి కన్నాబాబు రైతులకు సూచించారు. మార్కెట్లలో కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. దళారుల కంటే ఎక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించవచ్చని పేర్కొన్నారు. రైతుల కోసం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అన్నారు. అవసరం ఉన్న మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పౌరసర ఫరాల శాఖ, మార్కెటింగ్‌ శాఖ అధికారులను కోరారు. ధాన్యాన్ని విక్రయించేందుకు వచ్చే రైతులకు కేంద్రాల్లోనే ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తామని అన్నారు. ఇదిలావుంటే రాష్టాభ్రివృద్ధికి అడుగడుగునా అవరోధాలను సృష్టిస్తూ, పరిశ్రమల ఏర్పాటుకు విపక్షనేత బాబు అడ్డుతగులుతున్నాడని మంత్రి ధ్వజమెత్తారు. జగన్‌ తరహా వ్యక్తుల వల్ల దేశానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమానలు సిఎం జగన్‌ విజయవంత చేస్తున్నారని అన్నారు. ఇదిలావుంటే ప్రస్తుతం దేశంలో రైతులు నైరాశ్యంలో ఉన్నారని, అందుకే సమూల సంస్కరణలు చేపట్టేందుకు మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మాజీమంత్రి,బిజెపి నేత మాణిక్యాలరావు అన్నారు. ఈ క్రమంలోనే పంటలకు మంచిధర లభించేలా ‘ఈ-నామ్‌’ పేరుతో దేశంలోని అన్ని మార్కెట్లను అనుసంధానం చేయడం, ఫసల్‌ బీమా యోజన, భూసార కార్డుల పంపిణీ, కృషి సంచాయక యోజన పేరుతో పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సహకారం, యూరియా కొరత లేకుండా నిరోధించడం వంటివి చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంస్కరణల కారణంగా మున్ముందు దేశానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని భాజపా ప్రభుత్వం ధనికులకు, పారిశ్రామికవేత్తలకు మాత్రమే అనుకూలమన్న ప్రతిపక్షాల ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని అన్నారు. మోదీ రైతుల పక్షపాతి అని మంత్రి పేర్కొన్నారు.