దళితులపై దాడి ఘటనలో 54 మంది అరెస్టు

శ్రీకాకుళం: లక్ష్మీపేట దళితులపై దాడి ఘటనలో 65మంది నిందితుల్లో 54 మందిని అరెస్టు చేసినట్లు సీఐడీ అడిషనల్‌ డీజీ గోపాల కృష్ణారెడ్డి అన్నారు. ఈ ఘటనకు సంబంధించి బొత్స వాసుదేవనాయుడు, ఆవుల శ్రీనివాస్‌లను ప్రధాన నిందితులుగా గుర్తించామన్నారు. ప్రధాన నిందింతుల వివరాలు తెలిపిన వారికి డీజీ గోపాల్‌రెడ్డి రివార్డు ప్రకటించారు.