దళితులపై పోలీసుల ఏకె-47ల ప్రయోగం
గుజరాత్: సురేంద్రనగర్ జిల్లా, థంగ్‌డా పట్టణంలో దళితులు నిరసన ప్రదర్శనలు చేసినప్పుడు వారిపై రాష్ట్ర పోలీసులు ఏకె-47 రైఫిల్స్ ప్రయోగించినట్లు బుధవారం రాష్ట్ర హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇద్దరు 17ఏళ్ల యువకులతో సహా ముగ్గురు ఆ సంఘటనలో మరణించారు. పోలీసులు ప్రయోగించిన ఆయుధాలతో ఒక రివాల్వర్, ఒక 303పైఫిల్, కార్భన్ తుపాకి, ఎకె47లు ఉన్నాయని జిల్లా ఎస్పీ భగోరా తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో నలుగురు పోలీసులు నిందితులుగా ఉన్నారు. వారి లోకె.జడేజా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ ఎస్పీ ఆ దరఖాస్తును వ్యతిరేకించారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిందితులకు దళితులపై ద్వేషం, ముందస్తుగా ఏర్పరచుకున్న అపోహ(ప్రిజుడిస్) ఉన్నట్లు ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆయుధాలను స్వాధినం చేసుకుని ఫోరెనిక్స్ లాబ్‌కు పంపించినట్లు చెప్పారు. కేసు దర్యాప్తు పర్యవేక్షిస్తున్న ఐజీపీ అనిల్ ప్రాథమ్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. లాబ్ నివేదిక కొసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. అయితే ఎన్ని ఎకు47లను లాబ్‌కు పంపించింది చెప్పేందుకు నిరాకరించారు. కాగా కనీసం ఒక ఎకె47ను అయినా వినియోగించి ఉండవచ్చని డీజీపీ చిత్తరంజన్ దాస్ తెలిపారు. పోలీస్ కమాండో హరికృష్ణపటేల్ తన ఎకె47 నుంచి కనీసం 8 రౌండ్లు కాల్చినట్లు ఆయన చెప్పారు.