*దళితులు కొట్టిన పోడు భూములను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు! *ఫారెస్ట్ అధికారుల పై దళిత మహిళలు ఆగ్రహం
లింగంపేట్ 13 అక్టోబర్ (జనంసాక్షి)
దళిత మహిళలు ఫారెస్ట్ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన లింగంపేట్ మండలంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే లింగంపేట్ మండలంలోని ఒంటరిపల్లి గ్రామానికి చెందిన 66 మంది దళితులు 20 సంవత్సరాల క్రితం ఒంటరిపల్లి శివారులోని గైనం చెరువు పైన భూమి లేని నిరుపేద దళితులు 40 ఎకరాల పోడు భూమిని సాగు చేశారు.పోడు భూములు సాగు చేసుకున్న వారికి ప్రభుత్వం భూములకు పట్టాలు ఇస్తామని జీవో డుదల చేయడంతో గురువారం ఒంటరి పల్లి గ్రామానికి చెందిన 66 మంది నిరుపేద దళితులు భూమి సాగు చేసిన భూముల్లో చిన్న పొద తొలిగిస్తుండగా స్థానిక సర్పంచ్ రాజయ్యకు లింగంపేట్ ఎస్ఐ శంకర్ ఫోన్ చేసి కొత్తగ ఫారెస్ట్ భూముల్లో ఎవరు సాగు చేయొద్దు మీ గ్రామానికి ఫారెస్ట్ అధికారులు వస్తున్నారు.గ్రామంలో కూర్చుని మాట్లాడు కోవాలని తెలపడంతో గ్రామపంచాయతీ వద్దకు భూములు సాగు చేస్తున్న దళితులను గ్రామ సర్పంచ్ రాజయ్య పిలిపించి అధికారులతో మాట్లాడదామని చెప్పడంతో దళితులందరు అక్కడి నుంచి తిరిగి వచ్చారు.గ్రామంలోని దళిత మహిళలు ఫారెస్ట్ అధికారంతో మాట్లాడుతు గిరిజనులు పోడు భూములు సాగుచేస్తే ఎవరు ఏమనరు,పోడు భూములను దళితులు సాగు చేస్తే ఇంత అన్యాయమ అని ఫారెస్ట్ అదికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తు వాగ్వివాదానికి తీగడంతో ఫారెస్ట్ రేంజ్ అధికారి ఠాగూర్ ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాస్,తహసిల్దార్ మారుతి,భూమిలేని నిరుపేద దళితులకు న్యాయం చేస్తామని తెలపడంతో దళితుల కు ఫారెస్ట్ అధికారులకు జరిగిన వాగ్వాదం సద్దు మణిగింది.ఈకార్యంక్రమంలో లింగంపేట్ ఎస్ఐ శంకర్,ఎంపిఓ ప్రబాకరచారి,ఫారెస్ట్ అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area