దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
తులేకుర్డు గ్రామంలో దళిత బందు యూనిట్‌ ప్రారంభం
రంగారెడ్డి,ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పేర్కొన్నారు. యాచారం మండల పరిధిలోని చింతుళ్ళకు చెందిన అంకని జంగయ్యకు  దళిత బంధు పథకంలో భాగంగా  మంజూరయ్యింది. మంజూరైన దళిత బంధు యూనిట్ ను ఆదివారం ఎమ్మెల్యే కిషన్ రెడ్డి స్థానిక సర్పంచ్ సబితా, జడ్పిటిసి చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య,   మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పాశ్చ భాష ఇతరులతో కలసి  ప్రారంభించారు. సీఎం కేసీఆర్ పాలనలో లబ్ధిదారులకు సంక్షేమ పథకాల లబ్ది నేరుగా చేకూరుతుందని ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలను బహుకరించారు. కార్యక్రమంలో మండల నాయకులు చిన్నోళ్ల యాదయ్య,  కల్లూరి శివ, బొల్లంపల్లి వెంకటేష్, మండలి గోపాల్ తదితులు పాల్గొన్నారు