దళితుల ఆర్థికాభివృద్ధికే దళిత బంధు.
– బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
బెల్లంపల్లి, సెప్టెంబర్29,(జనంసాక్షి)
దళితుల ఆర్థికాభివృద్ధికే ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశ పెట్టారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గురువారం ఆయన
బెల్లంపల్లి మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన గోమాస లింగన్న, ముడిమడుగుల శంకర్ కు దళితబంధు పథకం ద్వారా మంజూరైన వాహనాలను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికి, వారికి ఆత్మగౌరవంతో జీవించడానికి దళిత బంధు పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్థికంగా వృద్ధి చెందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోమాస శ్రీనివాస్, బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కౌన్సిలర్ నారాయణ గారు, పట్టణ టీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, నియోజకవర్గ టీఆరెస్ పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మణ్, చంద్రవెళ్లి సింగిల్ విండో డైరెక్టర్ అనంతం, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆరెస్ నాయకులు గడ్డం భీమాగౌడ్, శ్రీధర్, విజయ్, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు .