దసరాలోగా ప్రకటించాలి

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 9 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని దసరా పండుగలోగా ప్రకటించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రీలేదీక్షలు మంళవారంనాటికి 1110వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,  రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్రం ఎంతో జాప్యం చేసిందని ప్రజలు సహనం కోల్పోకముందే తెలంగాణను  ప్రకటించాలని వారు డిమాండ్‌ చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ చెందిన మంత్రులు రాజీనామాలు చేయకపోతే తెలంగాణ ద్రోహులుగా ప్రజలు పరిగణిస్తారని వారు హెచ్చరించారు. చర్చలకు సమావేశాలకు స్వస్థి పలికి అందరూ కలిసి కట్టుగా ఉద్యమంలోకి రావాలని వారు సూచించారు.