దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకున్న ఎంపీపీ
అశ్వరావుపేట, సెప్టెంబర్ 26( జనం సాక్షి )
అశ్వారావుపేట గ్రామంలో శరన్నవరాత్రుల మహోత్సవంలో భాగంగా సోమవారం గ్రామంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో గల వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం మరియు నారంవారీ గూడెం గ్రామంలో ఉన్న దేవస్థానం నందు ఈ రోజు అవతారం లో భాగంగా కాశీ అన్నపూర్ణాదేవి నీ దర్శించుకొని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీపీ జల్లిపల్లి. శ్రీరామమూర్తి . ఈ సంధర్భంగా మాట్లాడుతూ అశ్వారావుపేట గ్రామంలో వెంచేసి ఉన్నా ఈ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం లో ప్రతి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని, దానిలో భాగంగానే ఈ దసరా నవరాత్రులను,అంగరంగ వైభవంగా ఏర్పాట్లను చేశారని,దానిలో భాగంగానే ప్రతి రోజూ ఒక అవతారంలో అమ్మవారిని అలంకరణ చేస్తారని ఆలయ కమిటి ఛైర్మన్ ముత్తా సుమాకర్ అధ్యక్షతన, నారంవారిగుడెం గ్రామంలో బండి పుల్లారావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని కావున ఎవన్మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించ గలరని ఎంపీపీ జల్లిపల్లి. శ్రీరామమూర్తితెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు టిఆర్ఎస్ పార్టి మండల అధ్యక్షులు బండి పుల్లారావు, మండల నాయకులు తాడేపల్లి రవి, శెట్టిపల్లి రఘురామ్, ఆలయ అర్చకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.