దసరా తర్వాత ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమం.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.
కొల్లాపూర్ నియోజకవర్గ ఎస్ఐల తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 29(జనంసాక్షి):
కొల్లాపూర్ నియోజక వర్గంలోని పెద్ద కొత్తపల్లి,కోడేరు,చిన్నంబావి,కొల్లాపూర్ ఎస్సైల పనితీరుపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అడుగులకు మడుగులోత్తుతూ ఆయా ఎస్సైలు తమ అనుచరుల అభిమానులపై తప్పుడు కేసులు బనాయించి చిత్రహింస లకు గురి చేయడం జరుగుతుందని, ఇప్పటికీ తమ అనుచరులైన 36మందిపై తప్పుడు కేసులు బనాయించి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఫిర్యాదుదారులపైనే దాడి చేయడం వారికే చెల్లిందని ఆయన విమర్శించారు.ఎమ్మెల్యే చేత కండువా కప్పి ఉంచుకుని వారి వర్గం లో చేరితే కేసులు ఉండవని,లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.కొల్లాపూర్ నియోజకవర్గ పోలీస్ స్టేషన్లలో జరిగుతున్న వ్యవహారాల ను ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు పిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, చివరకు కేసీఆర్, కేటీఆర్ లు దృష్టి కి తీసుకెళ్ళినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసుల ఆగడాలను పరిశీలించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినా ఈ నాలుగు పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు పనిచేయవని అన్నారు.అక్కడ విధులలో ఉన్న ఎస్ఐలపై చర్యలు తీసుకోకపోతే దసరా తర్వాత ప్రత్యక్ష కార్యాచరణతో ఎక్కి ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణ ఉద్యమం లా మరోసారి ఉద్యమ చేయడం ఖాయమని అన్నారు.ప్రజలకు జవాబుదారీ గా ఉండవలసిన పోలీసులు, ఎస్ఐలు ఎమ్మెల్యే కనుసన్నల్లో పనిచేస్తూ సాధారణ ప్రజలకు ఫిర్యాదుదారులను వేధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే అనుచరులు అక్రమాలకు అవినీతికి పాల్పడుతున్న పట్టించుకోక పోగా ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తమ అనుచరులపై కేసులు నమోదు చేసి రోజుల తరబడి పోలీస్ షన్ల చుట్టూ తిప్పించుకోవడం ప్రజాస్వామ్యం కాదని అన్నారు.పోలీసుల ప్రవర్తన వల్ల ప్రభుత్వం ఉందా అని సందేహం కలుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే తొత్తులుగా వ్యవహరిస్తూ తమ విధులను సక్రమంగా నిర్వహించని ఎస్సైలపై తగుచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఎస్ఐలు అందరూ ఒకేలా లేరని కొందరు ఎస్ఐల పనితీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు.ఇంకా ప్రేక్షక పాత్ర పోషించలేనని ఉద్యమానికి సిద్ధం అవుతానని ఘాటుగా విమర్శించారు.ఈ సమావేశంలో కొల్లాపూర్ కౌన్సిలర్ రహీం పాష, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ విష్ణు,గంట్రావుపల్లి సర్పంచ్ చిన్నయ్య, నాయకులు పసుపుల నరసింహ లక్ష్మణరావు రఘుపతిరావు శివ రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.