దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించు కుని అన్నదాన కార్యక్రమానికి 30వేల నగదు విరాళం.

మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్.
తాండూరు సెప్టెంబర్ 21( జనం సాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో కొలువుదీరిన అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమానికి 30వేల నగదును మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఐదు సంవత్సరాల నుండి ఆసుపత్రికి వచ్చే రోగులకు మరియు సిబ్బందికి తదితరులకు ఐదు సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం చేయటం జరిగిందని తెలిపారు.ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి మూడు అవార్డులు రావడం ఎంతో గర్వకారణ మని డాక్టర్ సూపరిండెంట్ దర్మీది రవిశంకర్ ను కొని ఆడారు. అనేక వ్యాధులతో ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతున్న రోగులు అమ్మవారి ఆశీస్సులతో త్వరగా కోలుకొని సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు.
అమ్మవారి ఆశీస్సులు జిల్లా ఆస్పత్రిలోని సిబ్బందిపై ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సునీల్ వార్డు బాయ్, కే. మల్లప్ప ,ఆశప్ప , తులసి రామ్, గోపాల్, ,సీ వెంకట్, జాంగిర్, కె .వెంకటేష్, బి. రవి తదితరులు ఉన్నారు.