దాడు చేస్తున్నా ఆగని గంజాయి రవాణా
ఎక్కడో ఓ చోట నిత్యం పట్టుబడుతున్న దొంగలు
దందాకు అలవాటు పడి దారులు వెతుక్కుంటున్న దళారులు
హైదరాబాద్,నవంబర్1 (జనంసాక్షి) : ఉభయ తెలుగు రాష్టాల్ల్రో దాడులు విపరీతంగా సాగుతున్నా గంజాయి రావణా ఆగడం లేదు. పట్టుబడితే పట్టుబడిది అన్న ధోరణిలో వ్యాపారాలు చేసే వారు రవాణాను ఆపడం
లేదు. గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒకచోట గంజాయి మత్తులో ఘర్షణలు చోటు చేసుకోవడం, డంపులు బయటపడుతుండడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఎక్సైజ్, పోలీసు శాఖలు గంజాయిపై మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.పలు ప్రాంతాల్లో రైతులను బెదిరించి డబ్బులు ఇచ్చి మరీ గంజాయి పెంచేలా ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది. ప్రధానంగా
గిరిజనులు ఉన్నచోట్ల ఈ పంట సాగు పెరిగిందన్న ఖచ్చితమైన ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయి. పలుజిల్లాలు గంజాయి నిషాలో జోగుతున్నాయి. జిల్లాల్లో గంజాయి మొక్కలు, డంపులు బయటపడడమే ఇందుకు నిదర్శనం. గంజాయి స్మగ్లర్లు యువతను, విద్యార్థులను కూలీలను టార్గెట్‌గా చేసుకుని గంజాయి దందా సాగిస్తున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. గంజాయి వినియోగం చాలానే పెరిగినట్లు తెలుస్తోంది. జిల్లాల్లో గంజాయి డంపులు, సాగు చేస్తున్న మొక్కలు బయట పడుతుండడంతో అధికార వర్గాలతో పాటు ప్రజల్లోనూ ఆందోళన నెలకొంటుంది. పలు పట్టణాలకు జాతీయ రహదారి, రైలు మార్గం ఉండడంతో ఇతర రాష్టాల్రు, జిల్లాల నుంచి రాకపోకలు చాలానే ఉన్నాయి. దీనిని అదునుగా చేసుకుంటున్న గంజాయి స్మగ్లర్లు పక్క రాష్టాల్ర నుంచి జోరుగా గంజాయిని తీసుకొస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎక్సైజ్, పోలీసు అధికారుల సమన్వయంతో దాడులు చేస్తూ గంజాయి సరఫరాను అడ్డుకుంటూనే ఉన్నారు. అయినప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా గంజాయి దందా కొనసాగుతున్నట్లు ఎక్సైజ్, పోలీసుల అధికారుల దాడుల్లోనూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. విశాఖపట్నం పరిసర గిరిజన ప్రాంతాలనుంచి నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని తీసుకువచ్చి పలుచోట్ల గుట్టు చప్పుడు కాకుండా నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా అరకిలో, కిలో పొట్లాల చొప్పున బయటకు తీస్తూ ఇతర ప్రాంతాలకు గంజాయి స్మగ్లర్లు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఒరిస్సాలో నుంచి రైలుమార్గం గుండా తీసుకొచ్చిన గంజాయిని పలు జిల్లాల్లో నిల్వ ఉంచుతూ మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా రైలు మార్గాన్ని ఎంచుకొని స్మగ్లర్లు గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
కొన్ని విద్యాసంస్థలను అడ్డాలుగా చేసుకుని గంజాయి మత్తులో యువకులు జోగుతున్నట్లు సమాచారం. మరికొందరు జల్సా మోజులో మాదకద్రవ్యాలను అలవాటు చేసుకుంటుండడంతో దీనిని గంజాయి స్మగ్లర్లు ఆసరాగా తీసుకుంటూ కల్లు కాంపౌండులు, పర్మిట్‌రూంలను అడ్డాలుగా చేసుకుని గంజాయి ఉచ్చులో దింపుతున్నారని సమాచారం. గంజాయిని సరఫరా చేస్తూ పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు పట్టుబడడం, కేసులు నమోదు చేయడంతో వారి జీవితాలు నాశనమవుతున్నాయి. మరికొందరు గంజాయికి అలావాటు పడుతూ దానికి బానీసై ప్రాణాల విూదికి తెచ్చుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎక్సైజ్, పోలీసులు మరింత నిఘా పెట్టినట్లయితే పెద్ద మొత్తంలో గంజాయి నిల్వలు బయట పడే అవకాశం ఉంది. గంజాయి లాంటి మత్తు పదార్థాలను నిలువరించాలని సిఎం కెసిఆర్ ఇటీవల కఠినమైన ఆదేశాలను జారీ చేసింది. దీంతో జిల్లాల్లో పోలీసు, ఎక్సైజ్ శాఖలు విస్తృతంగా నిఘా పెట్టి తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల కాలంలో జిల్లాల్లోని అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న మారుమూల గ్రామాలు, తండాల్లో గంజాయి సాగు జోరుగా జరుగుతుందనే సమాచారంతో మూకుమ్మడి దాడులు చేస్తున్నారు. గత నెల రోజులుగా ఎక్సైజ్ పోలీసు అధికారుల దాడుల్లో వేల సంఖ్యలో గంజాయి మొక్కలు బయటపడుతున్నాయి. ని అటవీ ప్రాంతాల్లో గల మారుమూల తండాలు, గ్రామాల్లో కొందరు గుట్టుగా గంజాయిని సాగు చేస్తున్నారు. మొక్కజొన్న, పత్తి, కంది లాంటి పంటల్లో అంతరపంటగా సాగు చేస్తున్నట్లు పోలీసు, ఎక్సైజ్ అధికారులు గుర్తిస్తున్నారు. వేలాది
సంఖ్యలో గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేస్తున్నారు.