దాల్మియా ఛార్జిషీటులో నిందితులకు సమన్లు జారీ
హైదరాబాద్: దాల్మియా ఛార్జిషీటులో నిందితుల సమన్లను సీబీఐ న్యాయస్థానం సీబీఐకి ఈరోజు అందజేసింది. ఈ కేసులో నిందితుడైన వైఎస్ జగన్‌ను వచ్చేనెల 7న కోర్టులో హాజరుపరచాలని సీబీఐకి పీటీ వారెంట్ జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న హోంమంత్రి సబితాఇంద్రారెడ్డితో పాటు 13 నిందితులకు జూన్ 7వ తేదీన న్యాయస్థానంలో హాజరుకావాలని సీబీఐ న్యాయస్థానం సమన్లు జారీచేసింది.