దాసరి నివాసంలో సోదాలు చేపట్టిన సీబీఐ

హైదరాబాద్‌,(జనంసాక్షి): బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేపిన సీబీఐ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సోదాలు చేపట్టింది. రెండు బృందాలుగా దాసరి నివాసానికి వచ్చిన సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ సీబీఐ అధికారుల బృందం దాసరిని ప్రశ్నించి వివరణ తీసుకుంటుంది. దాసరి నివాసంతోపాటు మరో ప్రైవేటు సంస్థ కార్యాలయంలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.