దిండి, మల్లన్నసాగర్‌లపై సీఎం సమీక్ష

4

హైదరాబాద్‌,జులై 2(జనంసాక్షి): డిండి ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం సాయంత్రం మంత్రులు, అధికారులతో సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుకు సమాంతరంగా లిఫ్ట్‌ నిర్మించి ఎల్లంపల్లి దిగువ రిజర్వాయర్లకు అందించే విధంగా ప్రణాళిక సిద్దం చేయాలన్నారు. మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ పురోగతితో పాటు డిండి ప్రాజెక్ట్‌ పనలు పురోగతని సిఎం కెసిఆర్‌ ఆరా తీసారు. మల్లన్న సాగర్‌ కు తరలించే క్రమంలో రిజర్వాయర్ల నుంచి నీటిని చెరువులకు తరలించాలన్నారు. మల్లన్న సాగర్‌ నుంచి బస్వాపూర్‌ వరకు ఉన్న రిజర్వాయర్లను నింపడంతో పాటు గొలుసుకట్టు చెరువుల ద్వారా నీటిని నింపాలని అన్నారు. గోదావరి, కృష్ణా నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల పురోగతని కూడా సిఎం సవిూక్షించారు. మల్లన్న సాగర్‌ ద్వారా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అవసరాలు తీరాలన్నారు. నీటిని లిప్టుల ద్వారా నింపుతూనే చుట్టుపక్కల గ్రామాల్లోని చెరువులు, కుంటలు నింపాలి. చెరువులు, కుంటలు నింపడంతో గ్రామాల్లో జలకళ తొణికిసలాడుతుంది. మల్లన్నసాగర్‌ నిర్మాణంలో అటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణకు సాగు అవసరాన్ని బట్టి నీటి పంపిణీ చేసుకోవచ్చు. రెండేళ్లలోపే మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌కు నీరు తరలించేలా నిర్మాణం పూర్తి చేయాలని సిఎం కెసిఆర్‌ సూచించారు. డిండి ప్రాజెక్టు నుంచి నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌ వరకు సాగునీటిని తరలించే కాలువల నిర్మాణం డిజైన్‌లను సీఎం పరిశీలించారు. డిండి నుంచి శివన్నగూడెం వరకు కాలువ నిర్మాణంపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. చింతపల్లి, గొట్టిముక్కుల, సింగరాయిపల్లి, కృష్ణపల్లి రిజర్వాయర్లను కృష్ణా జలాలతో నింపి నల్లగొండ కరువును తీర్చేలా పనులు జరగాలి. నర్లాపూర్‌ నుంచి డిండి ప్రధాన కాలువ నిర్మాణం పనులు చేపట్టాలి. నాలుగు రిజర్వాయర్ల పరిధిలో ముంపు అతి తక్కువ ఉండేలా కాలువ నిర్మాణం ఉండాలని ఆదేశించారు.రెండేల్లలో ఈ ప్రాజెక్ట్‌ పూర్తి కావాలన్నారు. అలాగే డిండి ప్రాజెక్ట ద్వారా చౌటుప్పల్‌ వరకు నీటిని అందించే డిజైన్లను పరిశీలించారు. డిండి, మల్లన్న సాగర్‌ పూర్తయితే చెరువుల సామర్థ్యం పెరుగుతుందని, భూగర్భ జలాలు పెరిగి గ్రామాలు నీటితో కళకళలాడుతాయన్నారు. సవిూక్షలో మంత్రులు హరీష్‌ రావు,జగదీశ్వర్‌ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.