దిద్దుబాటు చర్య
మనసు నొప్పించి ఉంటే మన్నించండి
` విచారం వ్యక్తం చేసిన కేటీఆర్
` మహిళలపై వ్యాఖ్యలు వెనక్కి
కేటీఆర్ మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాను ఉద్దేశ పూర్వకంగా మహిళలపై అలాంటి కామెంట్స్ చేయలేదని..తనకు, తమ పార్టీకి మహిళలంటే ఎంతో గౌరవముందని అన్నారు. అనవసరంగా దీనిని ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని అన్నారు.కించపరిచే ఉద్దేశం లేదుఒక వేళ తాను చేసిన వ్యాఖ్యలకు ఎవరికైనా మనస్తాపం కలిగివుంటే క్షమించమని కోరుకుంటున్నానని అన్నారు. తనకు అక్కచెల్లెళ్లను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదని అన్నారు. కావాలనే కాంగ్రెస్ మంత్రులు దీనిని పెద్దగా చేసి రాజకీయం నడుపుతున్నారని అన్నారు. ఇలాంటి చీఫ్ ట్రిక్స్ వలన నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చామని అన్నారు. పెద్ద మనసుతో తెలంగాణ మహిళలు అర్థం చేసుకుంటారని..ఆ నమ్మకం తనకు ఉందని కేటీఆర్ అంటున్నారు. కాగా కేటీఆర్ మహిళలపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. చివరకు ఆయన దిష్టిబొమ్మలను తగులబెట్టే దాకా వెళ్లింది. మహిళా సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. ఆర్టీసీ బస్సులలో తెలంగాణ మహిళలు కుట్లు, అల్లికలు, నిత్యావసరాలు అమ్ముకుంటే తప్పేమిటని కాంగ్రెస్ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అవన్నీ అమ్ముకుంటే ఫర్వాలేదు..వాళ్లు ఎలాంటి బ్రేక్ డ్యాన్సులు చేసినా ఫర్వాలేదు..కానీ బస్సుల్లో టిక్కెట్ కొనుక్కుని సీట్లు దొరకక అల్లాడుతున్న జనాలను పట్టించుకోవడం లేదని అన్నారు. తాను కేవలం బస్సుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేశానని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ మహిళా కమిషన్ కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుంది.తక్షణమే విచారణ జరిపించాలని మహిళా కమిషన్ ను ఆదేశించింది. దీనిపై మంత్రి సీతక్క సైతం కేటీఆర్ పై ఘాటుగానే స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోందని ..అది చూసి బీఆర్‌ఎస్ నేతలు ఓర్వలేక పోలున్నారని కేటీఆర్ పై రివర్స్ కౌంటర్ ఇచ్చారు.