దివ్యదర్శన యాత్ర ప్రారంభం

ఏలూరు,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): దుగ్గిరాలలో దివ్య దర్శన యాత్ర కార్యక్రమాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ సతీమణి రాధారాణి మంగళవారం ప్రారంభించారు. నియోజక వర్గంలోని దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు గ్రావిూణ మండలాలకు చెందిన వారు నాలుగు బస్సులలో దివ్య దర్శన యాత్రకు బయల్దేరారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తన ఇంటి వద్ద యాత్రకు వెళ్లే వారికి అల్పాహారం ఏర్పాటు చేశారు. దివ్య దర్శన యాత్ర విజయవంతంగా ముగించుకురావాలని సూచించారు. కార్యక్రమంలో రాట్నాలమ్మ ఆలయ కమిటీ ఛైర్మన్‌ రాయల విజయ వెంకట భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు