దివ్యాంగులకు అధిక పనులు కల్పించడంలో రామన్నపేట మొదటి స్థానం

ఉత్తమ అధికారులకు అవార్డులు*
రామన్నపేట డిసెంబర్ 3 (జనంసాక్షి)
 దివ్యాంగులకు  ఉపాధి హామీ పథకంలో అత్యధిక పనిదినలు కల్పించిన రామన్నపేట మండల అధికారులకు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా  ఉత్తమ అధికారులుగా ఎన్నికైనారు. రామన్నపేట మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకంలో పని చేయునున్న దివ్యాంగ కూలీలకు జిల్లాలోనే అత్యధికంగా పనులు కల్పించి రామన్నపేట మండలంను మొదటి స్థానంలో నిలిపిన  ఉపాది హామీ పథకం అదనపు కార్యక్రమ అధికారి  ఏపిఓ  పి.వెంకన్న, మండలంలో అత్యధికంగా  పనులు కల్పించిన ఎల్లంకి గ్రామ పంచాయితీ కార్యదర్శి పి.యాదయ్య లకు శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తమ అధికారులుగా ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిషత్ అభివృద్ధి అధికారి  జలంధర్ రెడ్డి సలహాలు, సూచనలు పాటించి అత్యధికంగా పనులను  చేయించినట్లు తెలిపినారు.  సిబ్బంది సహాకారంతో అత్యధికంగా పనులు కల్పించినట్లు పేర్కొన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపినారు.