దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

 ఎమ్మెల్యే కంచర్ల
 నల్గొండ బ్యూరో.జనం సాక్షి
 దివ్యాంగులు అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్దపెద్ద వేస్తుందని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు.  మంగళవారం మహిళా శిశు  వికలాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో  పవర్ గ్రిడ్  కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు అలీమ్  కో- వారి సౌజన్యంతో దివ్యాంగులకు మరియు విభిన్న  ప్రతిభావంతులకు పరికరాల ఎంపిక శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి  ప్రత్యేక అతిథిగా హాజరై మాట్లాడుతూ దివ్యాంగుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని దివ్యాంగ సోదరులు  జిల్లాలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గతంలో హలీం కో వారి సౌజన్యంతో బ్యాటరీ వీల్ చైర్స్ కోసం 420 దరఖాస్తు లు రావడం జరిగింది అవి నేటికీ పంపిణీ కాకపోవడం వికలాంగులకు ఇబ్బంది కలుగుతుందని వీటిని త్వరగా పూర్తి చేసి పంపిణీ త్వరలో పంపిణీ అయ్యే విధంగా కృషి చేస్తామన్నారు  అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వికలాంగుల కోసం 3016 పెన్షన్లు ఇస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తుందని గత ప్రభుత్వాల కంటే నేటి ప్రభుత్వాలు వికలాంగుల పట్ల చిత్తశుద్ధితో పని చేస్తున్నాయని వారి అభివృద్ధికి భాగస్వామ్యం ముందుకు తీసుకెళ్తున్నమని , వికలాంగుల కోసం నల్లగొండ నియోజకవర్గంలో ఒక ప్రత్యేక శిబిరాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తూ వారికి ఎక్కువగా బ్యాటరీ వీల్ చైర్ వచ్చేందుకు అవసరమైతే దాతలు సహకారం అందించడం జరుగుతుందని అన్నారు అని ఆయన అన్నారు వికలాంగుల కోసం ఒక్క క్యాంపు నిర్వహించడం క్యాంపు క్యాంపు నిర్వాహకులను ఎమ్మెల్యే గారు అభినందించారు ప్రభుత్వంతో పాటు వివిధ కంపెనీలు ముందుకు వచ్చి వికలాంగుల అభివృద్ధికి  ఎంతో కొంత తోడ్పాటు నివ్వటం తద్వారా ఈ రోజు కృత్రిమ కాలు ట్రై సైకిల్ వినికిడి పరికరాలు వికలాంగులకు గతంలోఇవ్వలేని పరికరాలు  ద్వారా గుర్తించి వారికి సరైన లబ్ధిదారులను ఎంపిక చేసి అందించడం జరుగుతుందని అన్నారు వికలాంగుల సంఘాలు ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేసి వారి యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందించాలని పరస్పర సహకారంతో మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు ఈరోజు ఆర్తో పెడికెల్లి హ్యాండి క్యాపుడు-149వినికిడి పరికరాల కు 43,చూపు లోపం కలవారు-10 ట్రై సైకిల్స్ కోసం 117 వీల్ చైర్ కోసం 26 సంక కర్రలు 84 స్మార్ట్ ఫోన్ కోసం 10 కృత్రిమ కాళ్ళు చేతుల కోసం 29 వినికిడి పరికరాలు 86 మెంటల్ రిటార్డేషన్ కిడ్స్ కోసం ఐదుగురు దరఖాస్తులు చేసుకున్నారని నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సుభద్ర గారు మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి గారు సి డి పి ఓ నిర్మల గారు వికలాంగుల శాఖ సిబ్బంది శ్రీహరి గారు వెంకట్ రెడ్డి గారు మునగాల నాగిరెడ్డి వికలాంగుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు