దివ్యాంగుల కోసం అవగాహన సదస్సు

ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 09(జనంసాక్షి): ఈనెల 12న ఖానాపూర్ లోనీ ఏఎంకే ఫంక్షన్ హాల్ లో దివ్యాంగుల కోసం అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు సక్షమ్ ఇందూర్ విభాగం కార్యదర్శి పంచగుడి మహేష్ అన్నారు.ఆదివారం స్థానిక విశ్రాంతిభవనంలో గోడ ప్రతులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగుల ఉపాధి ,విద్య,వైద్యం, వికాసం కోసం సక్షమ్  నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అధిక సంఖ్యలో దివ్యాంగులు హాజరై సదస్సును జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సక్షమ్ జిల్లా కోశాధికారి అశోక్, పడాల ప్రభాకర్, పర్మేష్ పాల్గొన్నారు.