దివ్యాంగ కిషోర బాలికలకు న్యూట్రిషన్ కిట్స్ నుపంపిణీ చేసిన ఎమ్మెల్యే పెద్ది

జనం సాక్షి: నర్సంపేట
నర్సంపేట నియోజకవర్గ ఐసిడిఎస్ పరిధిలో గల దివ్యాంగ కిషోర బాలికలకు న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేసిన  ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే
నర్సంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో  11 నుండి 14 సంవత్సరాల లోపు దివ్యాంగులైన బాలికలకు న్యూట్రిషన్ కిట్స్ ను అందించడం జరిగింది.
ఈ న్యూట్రిషన్ కిట్స్ లో
10 కేజీల గోధుమలు.
200 గ్రాములు నెయ్యి ప్యాకెట్.
1 కేజీ ఖర్జూర పండ్లు.
750 గ్రాముల ప్రోటీన్ బిస్కెట్స్.
4 ఐరన్ విత్ జింక్ సిరప్ బాటిల్స్.
90 మల్టీ విటమిన్ టాబ్లెట్స్.
ఈ యొక్క న్యూట్రిషన్ కిట్స్ లో ఉంటాయి.
నర్సంపేట డివిజన్ పరిధిలోని అన్ని మండలాలకు కలిపి నేడు మొదటి విడతగా 20 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే  చేతుల మీదుగా అందజేయడం జరిగింది. రెండో విడతలో మరింత ఎక్కువ మందికి, ఈ విధంగా విడుదలవారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా న్యూట్రిషన్ కిట్స్ ను అందజేయనున్నారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట డివిజన్ ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ రాధిక , నల్లబెల్లి మండల ఎంపీపీ ఊడుగుల సునీత, సూపర్వైజర్లు ఝాన్సీ, మంజుల, రాధ, శ్యామలాదేవి, ఝాన్సీ రాణి, మరియు అంగన్వాడి యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి అంగన్వాడీ టీచర్లు దేవమ్మ, స్వరూప, సరిత, విజయ, సునీత తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు