దీర్ఘకాలిక సమస్యల సాధన కోసమే ఏజెంట్ల సమాఖ్య
హైదరాబాద్ : దీర్ఘకాలిక సమస్యల సాధన కోసం సాధారణ బీమా సంస్థల ఏజెంట్ల సమాఖ్య ఆవిర్భవించింది. భారత దేశంలో ఇప్పుడున్న వాటితో పాటు భవిష్యత్తులో ఏర్పడే వివిధ బీమా సంస్థల ఏజెంట్ల సంఘాల వారికి సదస్సులు, చర్చలు నిర్వహించి వారిలో వృత్తిపరమైన సామర్థ్యం , పురోగతి, సాధారణ అభివృద్ధిని ప్రచారం చేయటం సమాఖ్య ముఖ్య ఉద్దేశమని సమాఖ్య నాయకులు హైదరాబాద్‌లో తెలిపారు. మూడోపార్టీ మోటారు వాహన ప్రీమియంపై కమిషన్, అన్ని ఉత్పత్తులపై 15 శాతం కనీస కమిషన్ ఇవ్వాలని, రవాణా టెలిఫోన్ వంటి ఖర్చులను తిరిగి పొందే సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.