దుబాయ్‌ మినీ భారత్‌.. మినీ ప్రపంచం..

5

– ఉగ్రవాదంపై పోరుకు కలిసి రండి

– మీ ప్రేమాభిమానాలు మరిచిపోలేను

– క్రికెట్‌ స్టేడియంలో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రధాని మోదీ

హైదరాబాద్‌  ఆగస్ట్‌17(జనంసాక్షి):

దుబాయ్‌ మినీ భారత్‌ మాత్రమే కాదని… మినీ ప్రపంచమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దుబాయ్‌లోని క్రికెట్‌ మైదానంలో ప్రవాసభారతీయులనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ భారతీయులు శక్తిమంతులు, సమర్ధులని వ్యాఖ్యానించారు. దుబాయ్‌కి రోజు700 విమానాలు వస్తాయి.. ప్రపంచంలోనే అత్యధిక విమానాలు వచ్చే ప్రాంతమిదే.. కానీ భారత ప్రధాని వచ్చేందుకు 34 ఏళ్లు పట్టింది.34 ఏళ్లతర్వాత ప్రధాని వస్తే సహజంగా అసంతృప్తి ప్రదర్శిస్తారు… కానీ ఇక్కడ అసంతృప్తి కాదు.. ప్రేమ వర్షం కరుస్తోంది. మీ ప్రేమాభిమానాలు మరిచిపోలేను.ఎదురుగా ఉన్న మీరే నాకు స్ఫూర్తి శీతల దేశాల్లోని ప్రజలు కూడా 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ఇక్కడ ఉడేందుకు ఇష్టపడతారన్నారు.

యూఏఈ, భారత మధ్య ఇవాళ నమ్మకం అనే వంతెన నిర్మించామన్నారు. ఈబలమైన పునాదితో ఉన్న వంతెన శతాబ్దాల తరబడి ముందుకు సాగుతుంది.

తీవ్రవాదం పంజావిసురుతున్న సమయంలో అబుదాబి రాజు గొప్ప ముందడుగు వేశామని మోది అన్నారు. ఉగ్రవాదుల్లో మంచి తాలిబాన్‌, చెడ్డ తాలిబాన్లు వుండరని ఉగ్రవాదులందరూ యావత్‌ సమాజానికి వ్యతిరేకులేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దుబాయ్‌ క్రికెట్‌ స్టేడియంలో ప్రవాస భారతీయుల నుద్దేశించి ప్రసంగించారు.

ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే……

ఉగ్రవాదాన్ని ప్రపంచం యావత్‌ కలిసి ఎదుర్కోవాలి. దేశంలో సుదీర్ఘంగా వున్న నాగా సమస్యను పరిష్కరించాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యూఏఈ కఠినచర్యలు తీసుకుంటోంది. భద్రతామండలిలో భారత శాశ్వత సభ్యత్యానికి యూఏఈ మద్దతు పలికింది.ఉగ్రవాదం మానవాళికి పొంచివున్న ముప్పు ఆయుధాలు చేపట్టిన వారు హింసను వదిలి శాంతి మార్గంలో నడవండి. భారత్‌ యూఏఈ మధ్య ఈవేళ నమ్మకమనే వంతెన నిర్మించామని ప్రధాని మోదీ అన్నారు. దుబాయ్‌లోని క్రికెట్‌మైదానంలో ఆయన ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. ఎన్నోఏళ్లుగా ఇక్కడి భారతీయులు కష్టపడి సంపాదించుకుంటున్నారని… భారత్‌ ్ణొరవాన్ని పెంపొందిస్తున్నారని చెప్పారు. భారత్‌లో వర్షం పడితే దుబాయ్‌లో ఉన్నవారి హృదయం ఉప్పొంగుతుందని చెప్పారు. దీంతో ఒక్కసారిగా సభలో చప్పట్లు మిన్నంటాయి. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు అణుపరీక్షలు నిర్వహించామని.. దీంతో ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యపోయిందని చెప్పారు. భారత్‌పై ఆగ్రహంతో కొందరు ఆంక్షలు విధించారని.. దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశారని చెప్పారు. భారత్‌కు సాయం చేయాల్సిందిగా వాజ్‌పేయూ పిలుపునిచ్చారని… ఆయన పిలుపుతో గల్ఫ్‌ దేశాల్లో ఉన్న భారతీయులు ఖజానా నింపడంలో సాయం చేశారని గుర్తు చేశారు. దుబాయ్‌లోని క్రికెట్‌ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం ముగిసింది. ఆయన సుమారు గంటకుపైగా చేసిన సుదీర్ఘ ప్రసంగానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌ యూఏఈ మధ్య నమ్మకానికి నాలుగున్నర లక్షలకోట్ల రూపాయల పెట్టుబడులే నిదర్శనమన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేవారు ఏకం కావాలన్నారు. అతివాదానికి చర్చలే పరిష్కారంకానీ హింసకాదని నాగాల సమస్యతో తేలిందన్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన అనంతరం ఇరుగు పొరుగుదేశాలతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దుబాయ్‌లోని క్రికెట్‌ స్టేడియంలో ఆయన ప్రవాస భారతీయల సమావేశంలో ఆయన ప్రసంగించారు. బంగ్లాదేశ్‌తో సుదీర్ఘకాలంగా వున్న ప్రాంతాల బదిలీలను శాంతిపూర్వకంగా పూర్తిచేశాం. శ్రీలంకలో తరచూ జరిగే మత్య్సకారుల గొడవను పరిష్కరించాం. మాల్దీవుల్లో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడితే యుద్దప్రాతిపదికపైన సాయం అందించాం. ఆఫ్గనిస్థాన్‌ పునర్‌నిర్మాణంలోనూ పాలుపంచుకుంటున్నాం. నేపాల్‌లో భారీ భూకంపం వస్తే వెంటనే మనం స్పందించాం.  ప్రపంచంలోని అన్ని ఆర్థికసంస్థలు భారత్‌ను అత్యంత ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న దేశంగా గుర్తించాయి. యూఏఈ ఆతిథ్యానికి ధన్యవాదాలు భారత్‌లో రూ.4.5 లక్షల కోట్లు పెట్టుబడులు యూఏఈ ముందుకు రావడం ఎంతో సంతోషం. ఈ దేశంలో దేవాలయం నిర్మించేందుకు స్థలం ఇవ్వడానికి ముందుకు వచ్చిన రాజవంశీయులకు నా కృతజ్ఞతలు  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగిస్తున్న దుబాయ్‌ క్రికెట్‌ స్టేడియం కిక్కిరిసిపోయింది. దాదాపు 50 వేలమందికిపైగా ప్రవాస భారతీయులు ఆయన ప్రసంగం వినేందుకు స్టేడియానికి తరలిరావడంతో సామర్థ్యానికి మించి నిండిపోయింది. స్టేడియం లోపల స్థలం చాలకపోవడంతో అనేకవేలమంది ప్రవాస భారతీయులు స్టేడియం బయట నుంచే ఆయన ప్రసంగాన్ని విన్నారు. ప్రధాని నరేంద్రమోదీ దుబాయ్‌లోని క్రికెట్‌ మైదానానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన ప్రవాసభారతీయులను ద్దేశించి ప్రసంగించనున్నారు. మోదీ మైదానానికి చేరుకోగానే ఆహూతుల హర్షధ్వానాలతో ప్రాంగణం ఒక్కసారిగా ¬రెత్తింది.