దుమ్మురేపుతున్న శ్యామ్ సంగ్‌ గెలాక్సీ ఎస్‌7

xthsv7jc

శ్యామ్ సంగ్‌ గెలాక్సీ ఎస్‌7 అమ్మకాల్లో దూసుకుపోతోంది. మార్చిలో విడుదలైన ఈ గెలాక్సీ కొద్ది రోజుల్లోనే శ్యామ్ సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ కు భారీ లాభాలను చేకూర్చింది. ఈ ఫోన్ విడుదలకు ముందు అమ్మకాలు 9 మిలియన్‌ యూనిట్లకు చేర్చాలని కంపెనీ నిర్ణయించింది. అనుకున్నట్లుగానే ఆ లక్ష్యాన్ని గెలాక్సీ ఎస్ 7 పూర్తి చేసుకుని ఇంకా వేగంగా ముందుకు వెళుతోంది. ఎస్‌6 గెలాక్సీ కంటే ఈ యూనిట్ల అమ్మకాలు మూడురెట్లు అధికమని శ్యామ్ సంగ్‌ తెలిపింది.
ఈ కంపెనీ షేర్లు కూడా మార్కెట్లో లాభాల బాటలో నడుస్తున్నాయి. ఎస్‌6 ఎడ్జ్‌ కంటే తక్కువ ధరతో, కొత్త ఫీచర్స్‌తో ఎస్ 7 మార్కెట్లోకి వచ్చింది. అమెరికా, యూరప్‌ లో గెలాక్సీ ఎస్‌6 కంటే ఎస్‌7 కే ఎక్కువ డిమాండ్‌ ఉందని మార్కెట్‌ విశ్లేషకులు తెలిపారు. శ్యామ్ సంగ్‌ మార్కెట్‌ షేరును పెంచడానికి గెలాక్సీ ఎస్‌7 ఎంతో దోహదం చేసిందని, చైనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా దీని అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. 2016 ఏడాదిలో అన్నీ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్లలో శ్యామ్ సంగ్‌ గెలాక్సీ ఎస్‌7నే భళా అనిపించుకుంటోంది.
శ్యామ్ సంగ్‌ గెలాక్సీ ఎస్‌7 ఫీచర్స్‌:
డిస్‌ ప్లే : 5.1 అంగుళాలు
సిమ్‌ల సౌకర్యం: డ్యూయల్‌ సిమ్‌(ఒకటి నానో సిమ్, మరొకటి సాధారణ సిమ్‌)
ఆపరేటింగ్‌ సిస్టమ్‌ : ఆండ్రాయిడ్‌ వి6.0
రామ్‌ : 4జీబీ
మెమోరీ : 32/64 జీబీ, మెక్రో ఎస్‌డీ 200 జీబీ వరకు
కెమెరా: 12 ఎంపీ ఎఫ్‌/ 1.7 ప్రైమరీ కెమెరా, 26 ఎమ్‌ఎమ్, 5ఎమ్‌పీ
ఫ్రంట్‌ కెమెరా విత్‌ డ్యూయల్‌ వీడియో కాల్‌