దుర్గామాత దీక్ష దారులు గోవులకు ప్రత్యేక పూజలు
దౌల్తాబాద్ అక్టోబర్ 1, జనం సాక్షి.
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో శనివారం దుర్గామాత దీక్షాదారులు గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వాటికి ఆహారాన్ని అందించారు. గోశాల నిర్వాహకులు గోసాం రక్షక ఉద్యమకారులు ఆది వేణుగోపాల్ ను ఈ సందర్భంగా దుర్గామాత స్వాములు సన్మానించరు.గోశాల నిర్వహణకు శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ 1116 రూపాయలు విరాళంగా అందిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా చేగుంట మండలం పులిమామిడి (కిష్టాపూర్)మాజీ సర్పంచ్ సీనియర్ జర్నలిస్ట్ దేవి ఉపాసకులు నాయిని రాజగోపాల్ మాట్లాడుతూ హిందూ ధర్మం సంస్కృతి సాంప్రదాయాల్లో గోవు చాలా విశిష్టత కలిగినదని అంతరిస్తున్న గో సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందు పై ఉందని గ్రామీణ ప్రాంతం అయిన దౌల్తాబాద్ లో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి గోశాలను నిర్వహిస్తున్న ఆదివేణుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల్లో గో సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయునిపై ఉందన్నారు. గోశాల నిర్వాహకులు ఆది వేణుగోపాల్ మాట్లాడుతూ శ్రీ దుర్గా భవాని దేవి ఉపాసకులు గోశాలకు వచ్చి గోవులకు ఆహారాన్ని అందించడంతోపాటు విరాళాలు ప్రకటించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.దాతలు ముందుకు వచ్చి గోషాల నిర్వహణకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవి ఉపాసకులు శివ అభిలాష్ సుందర్ అరుణ్ లు తదితరులు పాల్గొన్నారు.
Attachments area