దేనికైనా రెడీ సినిమాకు వ్యతిరేకంగా ధర్నా
సంగారెడ్డి, నవంబర్ 1 : బ్రాహ్మణులను కించపరిచే విధంగా దేనికైనా రెడీ సినిమాలో చిత్రికరించారని, వాటిలో తొలగించాలని, బ్రాహ్మణ యువకులపై దాడి చేసిన సినీ యాక్టర్ విష్ణు గుండాలపై, హీరో విష్ణు, మోహన్‌బాబులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారంనాడు మెదక్ పట్టణంలోన గంగినేని సినిమా థియేటర్ వద్ద స్థానిక బ్రాహ్మణ సంఘం, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ క్యాక్రమంలో తెరాస మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, బ్రాహ్మణ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.