దేవయ్య గుంపును సందర్శించిన డిఎస్పీ సత్యనారాయణ.
– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పి డాక్టర్ వినీత్ జి ఆదేశాల మేరకు.
బూర్గంపహాడ్ సెప్టెంబర్03 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినిత్ జి. ఐ పి యస్ ఆదేశాలమేరకు బూర్గంపహాడ్ మండలంలోని మారుమూల గ్రామమైన దేవయ్య గుంపును సందర్శించిన పాల్వంచ డిఎస్పీ సత్యనారాయణ బూర్గంపహాడ్ ఎస్ఐ సంతోష్ ఈ సందర్భంగా మారుమూల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న దేవయ్య గుంపు గుత్తికొయ గ్రామస్థులతో మాట్లాడుతూ మీకు విద్య, వైద్యం, కరెంటు సమస్య కానీ మంచినీటి ఏ సమస్య వున్నా భద్రాద్రి జిల్లా పోలీస్ మీకు అండగా ఉంటుందని, ఏ సమస్య వచ్చినా నేరుగా మాకు సమాచారం ఇవ్వగలరని మీ సమస్యలు తీర్చడానికి మేమున్నామని గుత్తి కోయ ప్రజలకు హామీ ఇచ్చిరు. మావోయిస్టులు అంటూ వచ్చి ఎవరైనా మాయ మాటలు చెప్తే అటువంటి మాటలకు ఎవరు మంత్రముగ్ధులు కావద్దని, ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినచో పోలీసులకు సమాచారం ఇవ్వగలరని, మిమ్మల్ని ఎవరైనా బలవంతంగా ఇబ్బందులకు గురి చేస్తే జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వగలరన్నారు. సుమారు రెండు గంటల సమయం వారితో కేటాయించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వ్రాసుకున్నామన్నారు. మీరు చెప్పిన సమస్యలను తీర్చడానికి జిల్లా పోలీసు యంత్రాంగం ముందు ఉంటుందని హామీ ఇచ్చారు. ఇంత మారుమూల గ్రామం లోకి వచ్చి తమ సమస్యలను అడిగి తెలుసుకున్న భద్రాద్రి జిల్లా పోలీసు వారి పట్ల దేవాలయ గుంపు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి సత్యనారాయణ, బూర్గంపహాడ్ ఎస్ఐ సంతోష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.