దేవాదుల నీటితో చెరువులను నింపేందుకు చర్యలు

వరంగల్‌,జూలై24(జ‌నంసాక్షి): గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని దేవాదుల ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉన్న చెరువులను నింపాలని ప్రభుత్వం యోచిస్తోంది. గోదావరిలో నీరున్నప్పుడు దేవాదుల నీటిని పంపింంగ్‌ ద్వారా చెరువులకు పంపింగ్‌ చేఇస చిన్ననీటి పారుదల రంగాన్‌ఇన పటిష్టం చేయాలని చూస్తున్నారు. గతంలో ఇలా పంటలను కాపాడేందుకు వెంటనే దేవాదులనీటిని పంపింగ్‌ చేసి ఆదుకున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రమంత్రి హరీష్‌ రావు గతంలో కూడా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం దేవాదుల ఎత్తిపోతల ద్వారా ఎస్‌ఆర్‌ఎస్పీ ఎల్‌ఎండి కాకతీయ కాలువ ద్వారా నీటి లభ్యతను బట్టి తాగునీటి సరిపడా నిల్వచేసి ఆతర్వాత ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దేవాదుల పంపింగ్‌ ద్వారా ధర్మసాగర్‌ చెరువు కింద దక్షిణ ఉత్తర కాలువ ద్వారా రైతాంగానికి నీరు విడుదల చేసి ఆదుకున్నారు. ప్రస్తుతం ఉన్న పంటలను కాపాడుకోవడంతోపాటు నీటి లభ్యతననుసరించి నీటిని జాగ్రత్తగా ప్రతి బొట్టును సద్వినియోగం చేసుకోవాలన్నారు. నీటి విడుదల సందర్బంగా అక్రమంగా గండి కొడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల పరిస్థితిని పరిశీలించి సలహాలివ్వాలని ఆదేశించారు. దీంతోగోదావరి జలాలను తరలిస్తే జిల్లాలో చెరువులు కళకళలాడనున్నాయి.

తాజావార్తలు