దేవాలయ పరిరక్షణ కోరుతూ హిందువాహిని ఆధ్వర్యంలో రాస్తారోకో
గోదావరిఖని, జనంసాక్షి: ఎన్టీపీసీలోని పోచమ్మ దేవాలయానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తు హిందువాహిని ఆధ్వర్యంలో మేడిపల్లి చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. పోచమ్మ దేవాలయానికి రక్షణ లేకపోవడంవల్ల గుర్తు తెలియని వ్యక్తులు గర్భగుడిలో విగ్రహాలను ధ్వంసం చేశారని వారు పేర్కొన్నారు. వెంటనే దేవాలయానికి రక్షణ కల్పించాలని డిమాండ్‌చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.