దేశంలోనే అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది తెలంగాణే: రేగా కాంతారావు

 పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 02 (జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం అశోక్ నగర్ లోని గిరిజన భవన్ లో పినపాక నియోజకవర్గ మండలాలకు చెందిన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నూతనంగా మంజూరైన, ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్  పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని అన్నారు,ఆసరా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల రూ. 1000 కోట్ల చొప్పున ఏడాదికి రూ.12 వేల కోట్ల ఖర్చు చేస్తున్నదని గుర్తు చేశారు. ఎప్పుడూ ఇవ్వవలసిన పింఛన్లు కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యమైందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 2016 పింఛన్ ఇస్తున్న ఘనత మన తెలంగాణ ప్రభుత్వానిది అన్నారు.సీఎం కేసీఆర్ 57 ఏండ్లు నిండిన వారందరికీ పింఛన్లు ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. టిడిపి హయాంలో 75 రూపాయలు కాంగ్రెస్ 200 రూపాయలు మాత్రమే ఇచ్చారని అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 25 వేల పింఛన్లు ఉంటే తెలంగాణ వచ్చాక 45 లక్షల మందికి ఇస్తున్నమని అన్నారు. అర్హులై ఉండి పింఛన్లు రానివారు ఎవరైనా ఉంటే, వారికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
 ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం.
 ఇంటి జాగా ఉన్న నిరుపేదల ఇల్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దసరా నుంచి ఆర్థిక సహాయం అందజేస్తోందన్నారు.  ఈ పథకాన్ని సీఎం కేసీఆర్  ఇప్పటికే ప్రకటించారని అన్నారు. ఇప్పటికి ఇల్లు లేని పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నమన్నారు.
 అర్హులందరికీ పింఛన్ లు
 దివ్యాంగులకు నెలకు రూ.3016 వితంతువులు ఇతర కేటగిరీల వారికి రూ. 2016 చొప్పున అందిస్తున్నామని అన్నారు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలతో పేదింటి ఆడపడుచులకు 1.16 లక్షల రూపాయలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. దేశం గర్వించేలా తెలంగాణలో పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్  పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. కొత్త పింఛన్ లు వృద్ధుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్ గార కే దక్కుతుందన్నారు, ఉత్తమ గ్రామపంచాయతీలలో తెలంగాణ రాష్ట్రం ముందున్న సంగతి గుర్తుంచుకోవాలని సూచించారు, దేశంలో ఏ రాష్ట్రంలోని ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు లేవని వారు అన్నారు.బిజెపి కాంగ్రెస్ పార్టీలు మస్తు మాటలు చెబుతున్నారని వాళ్ళని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని గుర్తు చేశారు తెలంగాణ ప్రభుత్వం లో అన్ని కులాలకు అభివృద్ధి జరుగుతోందన్నారు.కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా చివరి మడి వరకు నీళ్లు అందుతున్నాయని ఎక్కడలేని విధంగా పంటలు, సమృద్ధిగా  పండాయ అని అన్నారు, రైతు బీమా, రైతుబంధు, పథకం లాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు.
 ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం లోని అన్ని శాఖల ప్రభుత్వాధికారులు, టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు, వృద్ధులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.