దేశంలోనే తెలంగాణ రైతులను మొదటి స్థానంలో ఉంచాలన్నదే కేసీఆర్ లక్ష్యం

డి సీ సీ బి అధ్యక్షులు గొంగిడి మహేందర్ రెడ్డి.

మిర్యాలగూడ. జనం సాక్షి తెలంగాణ రైతులను దేశంలోనే మొదటి స్థానంలో ఉంచానని లక్ష్యంతో టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పనిచేస్తున్నారని నల్గొండ డిసిసిబి చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి అన్నారు సోమవారం మిర్యాలగూడ మండలం బి.అన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో పి ఏ సీ ఎస్ -అన్నారం ద్వారా నూతనంగా 21 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 308 మెట్రిక్ టన్నుల సామర్ధ్యo గల ఎరువుల గోడౌన్ ను మరియు కో-ఆపరేటివ్ బ్యాంకు నందు బంగారం పై రుణాలు ఇచ్చే సదుపాయాన్ని ప్రారంభించారు ,శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తో కలిసి మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు డిసిసిబి బ్యాంక్ నష్టాల్లో ఉందని అదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే రెండో స్థానంలో లాభాల్లో ఉందని గత ఎన్ని సంవత్సరాల క్రితం 900 కోట్లతో నడుస్తున్న డీసీసీబీ నేడు 1900 కోట్లతో నడుస్తుందని ఆయన తెలిపారు 11 కోట్ల 30 లక్షల లాభాల్లో అన్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 750 మంది విద్యార్థులకు విద్యా రుణాలు అందించినట్లు ఆయన తెలిపారు దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వివరించారు.రైతులు తెలంగాణ ప్రభుత్వాన్ని కెసిఆర్ ని ఆశ్రయించాలని ఆయన కోరారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే.జడ్పీటీసీ తిప్పన విజయసింహ రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హనుమంత్ రెడ్డి, డీసీఎంస్.జిల్లా వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, డీసీసీబీ.డైరెక్టర్ బంటు శ్రీనివాస్, డివిజనల్ వ్యవసాయ అధికారిని నాగమణి పి ఏ సీ ఎస్ చైర్మన్ అంబటి వెంకట్ రెడ్డి, జేర్రిపోతుల రాములు గౌడ్, కో అపరాతివే సీఈఓ మదన్ మోహన్, డీసీఓ , మాజీ ఎంపీపీ తిరుపతమ్మ, జానయ్య రైతు బంధు సమితి అధ్యక్షులు వీర కోటిరెడ్డి గడగోజు ఏడుకొండలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు శ్రీనివాసరెడ్డి చిట్టిబాబు మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదయ్య యాదవ్, సర్పంచ్ అంబటి వీరారెడ్డి, డిసిసిబి బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.