దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరవనిత, ఉక్కుమహిళ ఇందిరాగాంధీ వర్ధంతికి ఘన నివాళి.

కోటగిరి అక్టోబర్ 31 జనం సాక్షి:-మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రోజున ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి,ఆమె ఈ దేశాభివృద్ధికి చేసిన సేవలు,ప్రాణత్యాగాని పలువురు ఘనంగా స్మరించుకున్నారు.ఈ సందర్భంగా పలువురు సీనియర్ నాయకులు మాట్లాడుతూ.నేడు భౌతికంగా ఇందిరా గాంధీ లేక పోయిన ప్రజల గుండెల్లో మాత్రం ఆమె చిరస్థాయి గానిలిచిపోయారు.బడుగుబలహీన,హరిజన,గిరిజన,మైనారిటీ వర్గాల వారికి ఎంతో సేవచేసిన మహనీ యురాలు ఇందిరా గాంధీ అని వారు కొనియాడారు.హరిత విప్లవం,బ్యాంకుల జాతీ యత,ఇందిరమ్మ పథకాలు వంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో రకాల సంస్కరణల తో దేశ ప్రజలను ముందుకు నడిపిన ఉక్కు మహిల స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టం మనోహర్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హుసేన్,కోటగిరి ఎంపీటీసీ సెరనియర్ నాయకులు గంగాధర్ దేశాయ్,సాబేర్ బాయ్,వహీద్,కోటగిరి టౌన్ అద్యక్షులు ఆయుబ్, బర్ల భూమయ్య,హైమద్,కార్యకర్తలు తదితరులు,
పాల్గొన్నారు.