దేశభక్తి ముసుగులో మోడీ అకృత్యాలు
దేశాన్ని కాపాడుకోకుంటే ముప్పు
సేవ్ ఇండియాలో సిఐటియూ నేతల ఆందోళన
విజయనగరం,ఆగస్ట్9(జనంసాక్షి): దేశభక్తి ముసుగులో దేశాన్ని అమ్మేస్తున్న బిజెపి, మోడీ నుంచి దేశాన్ని కాపాడుకుందామని కార్మిక, రైతు, వ్యవసాయ, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సేవ్ ఇండియా పేరుతో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన ధర్నా చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.సుబ్బరామమ్మ మాట్లాడుతూ రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను 4 కోడ్ లుగా విభజించి బానిసలుగా తయారు చేస్తున్నారన్నారు. వెంటనే 4 కార్మిక కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్మకం చేయడాన్ని విరమించుకోవలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని,172 సెక్కులర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలపై భారాలు వేసే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. నేడు దేశాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెª`టటె బిజెపి, మోడీ విధానాలను తిప్పికొట్టాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా రైతు, కార్మిక ఐక్య పోరాటాలు జరుగుతున్నాయని రానున్న కాలంలో క్విట్ కార్పొరేట్ ఉద్యమాన్ని మరీంత ఉదృతం చేస్తున్నామని, ప్రభుత్వం వెనక్కి వెళ్లకపోతే మోడీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నిరసన ధర్నాకి సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మద్దతు ఇచ్చి మాట్లాడారు. సిఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ, ఐ ఎన్ టియుసి జిల్లా అధ్యక్షులు ఎం.శ్రీనివాసరావు, ఏ ఐ టియుసి నాయకులు రంగరాజు, బి.అశోక్, ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి.రాంబాబు, ఇఫ్టు నాయకులు పి.మల్లిక్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి పి.రామ్మోహన్, ఏ ఐ ఎస్ ఎఫ్
నాయకులు నాగభూషణం, టి.జీవన్, సిఐటియు నాయకులు ఏ.జగన్మోహన్, బి.రమణ కార్మిక, రైతు, వ్యవసాయ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.