దేశరాజకీయాల్లో కెసిఆర్‌దే కీలక భూమిక

జాతీయరాకీయాల్లో సత్తా చాటనున్న కెసిఆర్‌
విూడిమాతో ఎంపి బూరనర్సయ్య గౌడ్‌
యాదాద్రి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి):  దేశ రాజకీయాల్లో సిఎం కేసీఆర్‌ కీలక భూమిక పోషించనున్నారని, అవసరమైతే చక్రం తిప్పనున్నారని భువనగిరి  ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లు గెలవనున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోమవారం విూడియాతో మాట్లాడిన బూర సర్సయ్య గౌడ్‌.. పుల్వామా ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భువనగిరిలో మహిళా సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందని చెప్పారు. దేశంలో మూడవ సైనిక్‌ స్కూల్‌ను భువనగిరిలో ఏర్పాటు చేయనున్నామన్నారు. సైనిక్‌ స్కూల్‌లో సెక్యూరిటీ కోర్సులకు శిక్షణ ఇస్తామని స్పష్టం చేశారు. భువనగిరి కేంద్రీయ విద్యాలయానికి రూ.23కోట్లతో సొంత భవనం ఏర్పాటు చేస్తామని హావిూ ఇచ్చారు. భువనగిరిలో రూ.13కోట్లతో 100 పడకల మాతా శిశు ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని, భువనగిరిని మెడికల్‌ ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మార్చడమే తన సంకల్పమని ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ తెలిపారు.
దేశంలోనే కేసీఆర్‌ నెంబర్‌వన్‌ సీఎం అని అన్నారు. దేశంలో ఎక్కాడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణ సంక్షేమ పథకాలను చూసి అబ్బురపడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఇతర పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారన్నారు.