దేశానికి ఆదర్శంగా తెలంగాణ పథకాలు
ప్రగతినివేదన సభతో ప్రతిపక్షాల దుర్నీతిని ఎండగడతాం: రసమయి
కరీంనగర్,ఆగస్ట్31(దేశానికి ఆదర్శంగా తెలంగాణ పథకాలు): గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ మెరుగు పరిచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిన ఘనత సిఎం కెసిఆర్‌దని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలిపారు. నాలుగున్నరేళ్లుగా అవిశ్రాంతంగా అనేక కార్యక్రమానలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లామని అన్నారు. ఇవాళ తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. వాటినే ప్రగతినివేదిక సభ ద్వారా మరోమారు తెలియచేయ బోతున్నామని అన్నారు. అలాగే విపక్షాల తీరును ఎండగడతామని అన్నారు. కాళేశ్వరంతో దశమారనుందన్నారు. రూ.వెయ్యి కోట్లతో రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీని నిండుకుండలా మార్చుతున్నామన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు ఘనంగా జరగాలని రూ.1,00, 116 అందిస్తున్నామన్నారు. ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీ మైనార్టిలకు మాత్రమే వర్తింపజేసిన ఈ పథకాన్ని ఆర్థికంగా బీసీ, ఈ బీసీ వర్గాలకు సైతం వర్తింపజేసినట్లు తెలిపారు. అలాగే గొల్లకురుమలకు ప్రతీ కుటుంబానికి రాయితీపై గొర్రెలు ఇస్తున్నట్లు చెప్పారు. మత్స్యకార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ చెరువుల్లో, రిజర్వాయర్లలో చేపల పెంపకం చేపట్టామన్నారు. అలాగే గత ప్రభుత్వాల పాలనలో అభివృద్ధితోపాటు ఆయా రంగాల్లో నిర్లక్ష్యానికి గురైన మైనారిటీలకు తెలంగాణ సర్కార్ పెద్దపీట వేసిందన్నారు. ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ప్రభుత్వ దావాఖానాల్లో కాన్పు అయిన పేద మహిళలందరికి రూ.12వేల ఆర్థిక సాయం, ఆడపిల్ల పుడితే అదనంగా మరో వెయ్యి అందిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ కిట్ల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో సన్న బియ్యంతో మెరుగైన భోజనాన్ని అందిస్తున్నామన్నారు.
——–