దేశానికే ఆదర్శంగా హరితహరం;మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ

ఆకుపచ్చ తెలంగాణగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహరం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ అన్నారు.
మంగళవారం పట్టణంలోని 7వ వార్డులో జాతీయ రహదారి పక్కన నిర్వహించిన 8వ విడత హరితహర కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.మానవ
మనుగడకు మొక్కలే ప్రదాన మని,ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలనిఅన్నారు.పచ్చదనాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి భాద్యత అన్నారు.చెట్లు లేకపోతే మానవ మనుగడ కష్టతరమవుతుందన్నారు.
అదే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కోదాడ పట్టణాన్ని హరిత కోదాడగా మార్చేందుకు కృషి
చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్
కమీషనర్ మహేందర్ రెడ్డి,వార్డు కౌన్సిలర్ దారావత్ కైలా స్వామినాయక్,సాయి కృష్ణ,వరుణ్,శేఖర్,భవాని,
శారద,విజయేందర్ రెడ్డి,మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.