దేశాన్ని డిజైన్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

కేంద్ర మంత్రి ఆనంద్‌ శర్మ

హైదరాబాద్‌ : డిజైనింగ్‌ హబ్‌గా భారతదేశాన్ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కేంద్ర వాణిజ్య ,పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్‌శర్మ అన్నారు. వచ్చ ఐదేళ్లలో పదిహేను వేల క్రాఫ్ట్‌ డిజైనర్లను తయారు చేస్తామని ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌ గచ్చీబౌలిలో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి ఆనంద శర్మతో పాటు పల్లంరాజు , ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్‌ జాతీయ సంస్థల ఏర్పాటుకు అనువైన ప్రాంతమని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటికే చిత్తూరు, మెదక్‌ జిల్లాలకు మంజూరైన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ జోన్‌తో పాటు ఒంగోలులోను మరోటి ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం కేంద్ర మంత్రిని కోరారు. దీనికి స్పందించిన ఆయన భూమి లభ్యతను అంచనా వేసుకోవాల్సిందిగా సూచించారు. రాష్ట్రానికి మరో మ్యానిఫ్యాక్చరింగ్‌ జోన్‌ మంజూరికీ తమకెలాంటి అభ్యంతరం లేదని కేంద్ర మంత్రి ఆనంద్‌ శర్మ స్పష్టం చేశారు.