దేశీయ విత్తనాలను ప్రోత్సహించాలి : సుభాష్ పాలేకర్
హైదరాబాద్: దేశీయ విత్తనాలు లభించేలా రైతులను ప్రోత్సహిస్తే నాణ్యమైన రసాయ రహిత పంటలు పండించవచ్చని ప్రకృతి వ్యవసాయ విధాన ఉద్యమ స్థాపకుడు సుభాష్ పాలేకర్ సూచించారు. నగరంలోని రామకృష్ణమఠం రహదారిలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ ఉద్యమ రాష్ట్ర కార్యాలయం, కాల్ సెంటర్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. దేశీయ విత్తనాల్ని అందుబాటులో ఉంచడం, ప్రకృతి వ్యవసాయ విధానాలపై శిక్షణా తరగతుల్ని నిర్వహించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ కార్యాలయాన్ని స్థాపించినట్లు ఆయన తెలియజేశారు.