దేశ అభివృద్దికి ఆర్థిక స్థిరత్వం ముఖ్యం
హైదరాబాద్: దేశ అభివృద్దికి ఆర్థిక స్థిరత్వం ముఖ్యమని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. సెన్‌లో రిస్క్ మేనేజ్‌మెంట్‌పై జరిగిన సదస్సులో ఆయన స్రంగించారు. ఇప్పటికి దేశం ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో కోట్టుమిట్టాడుతుందని స్పష్టం చేశారు. మన జాతీయ బ్యాంక్‌లు పటిష్ఠంగా ఉండటానికి కారణం ప్రజల సంపూర్ణ విశ్వాసం, ఇక్కడి ఆర్థిక మూల సూత్రాలే కారణమన్నారు. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు భారతీయ విపణిపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. సమీప భవిష్యత్తులో ఉత్పత్తి రంగాలపై బ్యాంక్‌లన్నీ దృష్టి పెట్టాల్సిన అవసరముందన్నారు. తద్వారా నిరుద్యోగితను తగ్గించ వచ్చాన్నారు. సంక్షోభ పరిస్థితులున్నప్పటికి భారతీయ బ్యాంక్‌లు గడిచిన ఐదేళ్లలో 5వందల బిలియన్ రూపాయల వ్యాపారం చేశామన్నారు.