దేశ వ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌

5A

తుపాకీ నీడలో పంద్రాగస్టు

న్యూఢిల్లీ, ఆగస్ట్‌14(జనంసాక్షి):

స్వాతంత్య దినోత్సవం సందర్భంగా దేశరాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించి తనిఖీలు ముమ్మరం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో వేడుకలు జరిగే ఎర్రకోట వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎర్రకోట నుంచి ప్రధాని ఉదయం ప్రసంగిస్తారు. దీనికి దేశంలోని విఐపిలు హాజరవుతారు. దీంతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో అడుగడుగునా పోలీసులు నిఘా పెంచారు. ప్రధాని నరేంద్రమోడీకి ఏడంచెల భద్రత కల్పించారు. స్వాతంత్య దినోత్సవ వేడుకలు జరిగే ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో చురుకైన 6 వేల మంది షూటర్లను మోహరించారు. ఎర్రకోట పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పంద్రాగస్టు సమయంలో దేశంపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు సిద్ధపడుతున్నారని కేంద్ర ¬ంశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ మనదేశంలో విధ్వంసానికి కుట్ర పన్నుతోందని నిఘా వర్గాలకు సమాచారం అందింది. అఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌కు ప్రయాణించే ఎయిరిండియా విమానాలను పేల్చేసేందుకు ఐఎస్‌ఐ వర్గాలు కుట్రపన్నుతున్నట్లు తెలుస్తోంది. అలాగే పాలకపక్షం బీజేపీ కార్యాలయాలపై దాడులు జరిగే అవకాశం ఉంది. ఇక ఉగ్రవాదులు దేశంలో వాయు, జల మార్గాల్లో చొరబడే ప్రమాదం ఉందని ¬ంశాఖ వర్గాలు హెచ్చరించాయి. పారాగ్లైడర్ల ద్వారానో, స్మగర్‌ బోట్ల ద్వారానో ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించవచ్చని తెలుస్తోంది. ¬ంశాఖ నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. తీరప్రాంతాల్లో గస్తీదళాలను అప్రమత్తం చేశాయి. అలాగే విమానాశ్రయాలు, సరిహద్దులల్లో భద్రతనుపెంచి తనిఖీలు ముమ్మరం చేశారు.

స్వాతంత్య దినోత్సవం రోజున దేశంలో పలు చోట్ల ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించింది. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో అన్ని రాష్టాల్రు అప్రమత్తమయ్యాయి. ఇక ఆయా రాష్టాల్ల్రో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాన నగరాలతో పాటు పట్టణాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన నగరాల్లోని ¬టల్స్‌లో తనిఖీలు చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్‌లలో భద్రత పెంచారు.  రాష్టాల్రు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించడంతో హైదరాబాద్‌, సైబరాబాద్‌ల పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విశాఖ పట్టణంలోనూ పోలీసు బలగాలను మోహరించారు. గురువారం రాత్రి నుంచి హైదరాబాద్‌, విశాఖ నగరాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. శంషాబాద్‌, విశాఖ విమానాశ్రయాల దగ్గర భద్రతను పెంచారు.

శ్రీనగర్‌లో ఆంక్షలు

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీనగర్‌ పట్టణంలోని పలు ప్రాంతాల్లో అధికారులు  ఆంక్షలు విధించారు. పాకిస్థాన్‌ స్వాతంత్యద్రినోత్సవాన్ని పురస్కరించుకొని వేర్పాటువాదులు శ్రీనగర్‌లో వేడుకలు జరుపుకోకుండా ఉండేందుకు ఈ ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు. ఖన్యార్‌, నౌహట్టా, రైన్‌వారీ, ఎం.ఆర్‌ గంజ్‌, మైసుమా, క్రల్‌ఖుడ్‌, సాఫాఖాదల్‌ మొత్తం ఏడు ప్రాంతాలలో ఆంక్షలు విధించినట్లు సీనీయర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. హురియత్‌ గ్రూప్‌ చైర్మన్‌ మిర్వైజ్‌ ఉమర్‌ ఫరూఖ్‌ని గృహనిర్భందంలో ఉంచినట్లు ఆయన చెప్పారు. సీఆర్‌పీఎఫ్‌, పారామిలిటరీ బలగాలు భారీగా మోహరించినట్లు తెలిపారు. ఈ ప్రాంతాలలో ప్రతి సంవత్సరం ఆగస్టు14వ తేదీన కొందరు యువకులు పాక్‌ జెండాలను పట్టుకొని తిరుగుతారని ఆయన అన్నారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకోవాలని కేంద్ర ¬ం మంత్రిత్వశాఖ రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసిందని పోలీసు అధికారి చెప్పారు.