దేశ సమైక్యత సమగ్ర అభివృద్ధికై సమర శంఖారావానికి సిద్ధం కావాలి

టేకులపల్లి,అక్టోబర్ 11( జనం సాక్షి): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎన్నికల హామీల అమలకై దేశ సమైక్యత సమగ్ర అభివృద్ధికై సమర శంఖారావానికి సిద్ధం కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గూగుల్ వద్ద రామచందర్ పిలుపునిచ్చారు. మంగళవారం టేకులపల్లి మండల కేంద్రంలో సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 14న లక్షలాది మందితో మహా ప్రదర్శన,బహిరంగ సభ కు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ 24 మహాసభలకు కదిలి రావాలని కోరారు. గడప గడప నుంచి సిపిఐ జాతీయ మహాసభలకు అక్టోబర్ 14 నుంచి 18 తేదీ వరకు విజయవాడ కేంద్రంలో జరగబోతున్న నేపథ్యంలో మహాసభల ప్రారంభ సూచికంగా లక్షలాది మందితో మహా ప్రజా ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టేకులపల్లి ప్రాంత ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎన్నికల హామీల అమలకై దేశ సమైక్యత సమగ్ర అభివృద్ధికై సమర శంఖారావం పూరించడానికి సిద్ధం కావాలని అన్నారు. రోజురోజుకు పేదవాడు మరింత పేదవాడుగా, ఆదాని అంబానీ లాంటి సంపన్నులు రోజుకు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జిస్తున్నారని దీనికి కారణం పాలకుల విధానాలను ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు దేశ సంపదను అప్పనంగా అప్ప చెప్పుతున్నారనిఅన్నారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందిందని, పేదవాడికి సరైన విద్య, వైద్యం, ఆహారం అందని ద్రాక్షగా మిగిలిపోతుందనివిమర్శించారు. ఈ తరుణంలో సిపిఐ జాతీయ మహాసభలు వేదికగా దేశంలో జరుగుతున్న మత ఘర్షణలు పేద ప్రజల సమస్యలపై దేశ సమైక్యత కోసం పోరాట రూపకల్పన చేసి పాలకులపై గర్జించటానికి అన్ని వర్గ�