దేశ సార్వభౌమత్వాన్ని కాపాడతా: ప్రణబ్
న్యూఢిల్లీ: దేశ సార్వభౌమత్వాన్ని కాపాడతానని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశాక ఆయన మాట్లాడుతూ తనను అత్యున్నత పదవికి ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో మనం ఎంతో ప్రగతిని సాధించామని ఆయన అన్నారు. దీంతోపాటు యువతకు మెరుగైన అవకాశాలు కల్పించవలసిన బాధ్యత మనపై ఉందని ఆయన అన్నారు. మనకు గొప్ప సంస్కృతి ఉందని భిన్నత్వంలో ఏకత్వం మన గొప్పతనమన ఆయన చెప్పారు. మన దేశంలోని వివిధ మతాల ప్రార్థనామందిరాలకు ఇస్తున్న గౌరవమే ఇందుకు నిదర్శినమని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. భారతీయులు ఎన్నో పోరాటాలు చేసి ఈ ప్రగతి సాధించారని, వారు పరస్థితులను సరిగా అర్థం చేసుకోగలరని అందుకే ప్రపంచ ఆధునికీకరణకు భారత్ ఓ నమూనాగా మారిందని ఆయన తెలియజేశారు.