దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ ప్రమాణస్వీకారం
న్యూఢిల్లీ : భారత్ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్‌హల్లో ఉదయం 11.30గంటలకు సుప్రీంకొర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కాపాడియా అయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మీరాకూమార్ తోడురాగా ఆయన పార్లమేంట్ సెంట్రల్‌హలుకు వచ్చాడు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రణబ్‌ను రాష్ట్రపతి పదవినుండి వైదోలుగుతున్న ప్రతిభాపాటిల్ రాష్ట్రపతి స్థానంలో అశినులను చేశారు. అనంతరం త్రిసైన్యాధ్యక్షుడికి పార్లమెంట్ వెలుపల 21తుపాకులతో సైనికవందనం సమర్పించారు. ప్రధాని మన్మోహన్ సింగ్, విపక్షనేతలు సుష్మ స్వరాజ్, అద్వానీ, శరద్‌పవార్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.