దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్
లక్సెట్టిపేట్: లక్సెట్టిపేట్ ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. చుక్క రాజేందర్, ఆడెపు వేణుగోపాల్‌లను అరెస్ట్ చేసి వారి నుంచి 4తులాల బంగారు ఆభరణాలు, 8తులాలు వెండి పట్టీలు, రూ.3వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు లక్సెట్టిపేట్ సీఐ గోపతి నరేందర్ తెలిపారు.