దొంతిపై తప్పుడు ప్రచారం చేస్తే గుణపాఠం తప్పదు

ఓ బి సి సెల్ మండల అధ్యక్షులువల్లే శ్రీనివాస్,
ఖానాపురం సెప్టెంబర్ 23(జనం సాక్షి )
నర్సంపేట మాజీ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి తో బిజెపి నాయకుడు ఈటెల రాజేందర్ మంతనాలు జరుపుతున్నట్లు రాజ్ న్యూస్ లో ఒక కథనం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామనిఓ బి సి సెల్ మండల అధ్యక్షులువల్లే శ్రీనివాస్ అన్నారు.దొంతి మాధవ రెడ్డి వ్యక్తిత్వం తెలిసిన ఏ వ్యక్తి ఇలాంటి ప్రచారాలను నమ్మరు అన్నారు. మాధవరెడ్డి అంటేనే కాంగ్రెస్…… కాంగ్రెస్ అంటేనే మాధవరెడ్డి దీనిలో ఇసమంతా కూడా మరో ఆలోచన లేదు అన్నారు. ప్రజల్లో దొంతి మాధవరెడ్డి పట్ల పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న తప్పుడు ప్రచారం ఇలాంటి వారిని గుర్తిస్తాం తగిన గుణపాఠం నేర్పుతాం ఖబర్దార్ అని హెచ్చరించారు.