ద్విపాత్రాభినయంలో ఆదిత్యారాయ్‌


’ఆషికి`2’, ’ఓకే జాను’, ’కలంక్‌’, ’మలంగ్‌’ వంటి సినిమాలతో బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆదిత్య రాయ్‌ కపూర్‌. గత కొంత కాలంగా హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన ’ఓమ్‌’ బాక్సాఫీస్‌ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం పది కోట్లను కూడా కలెక్ట్‌ చేయలేకపోయింది. ఈ చిత్రం రాయ్‌ అభిమానులకు కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలో ఆదిత్య ఈ సారి ’గుమ్రాప్‌ా’తో ఎలాగైనా హిట్‌ కోట్టాలని కసితో ఉన్నాడు. ఈ చిత్రంతో వర్ధన్‌ కేట్‌కర్‌ దర్శకుడిగా పరిచయమ వుతున్నాడు.తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. చిత్రబృందం కేక్‌ కట్‌ చేసుకుని సంబురాలు చేసుకుంది. సినిమా కోసం ఎగ్జైటెడ్‌గా ఎదురు చూస్తున్నాం అని తెలిపింది. ఈ చిత్రంలో ఆదిత్య డ్యూయల్‌ రోల్‌లో నటిస్తున్నాడు. మొదటి సారిగా ఆదిత్య రాయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మృనాళ్‌ థాకూర్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనుంది. కైమ్ర్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సినీ1 స్టూడీయోస్‌, టీ`సిరీస్‌ బ్యానర్‌లపై భూషన్‌ కుమార్‌, మురుద్‌ కేతాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆదిత్య ’ది నైట్‌ మేనేజర్‌’ రీమేక్‌లో నటిస్తున్నాడు. సందీప్‌ మోడీ దర్శకత్వం వహిస్తున్నాడు. శోభితా ధూళిపాళ్ళ, అనీల్‌ కపూర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.