ద.కొరియా మాజీ ప్రధాని కన్నుమూత
సియోల్, జూన్23(జనం సాక్షి) : దక్షిణ కొరియా మాజీ ప్రధాని కిమ్ జోంగ్ పిల్ కన్నుమూశారు. ఆయన ద.కొరియా నిఘా సంస్థ వ్యవస్థాపకులు. 92ఏళ్ల కిమ్ పిల్ రెండు సార్లు దేశ ప్రధానిగా పనిచేశారు. వయసు విూదపడిన కారణంగా అనారోగ్య సమస్యలతో కిమ్ పిల్ మరణించినట్లు సియోల్‌లోని సూన్‌చున్‌హైయాంగ్ యూనివర్సిటీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. 1961లో కొరియాలో ఆర్మీ మేజర్ జనరల్ పార్క్ చుంగ్ హీ అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించేందుకు సహకరించిన వారిలో కిమ్ పిల్ కీలక వ్యక్తి. తర్వాత కిమ్ పిల్ కొరియన్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీని స్థాపించారు. ఇప్పుడు అదే నేషనల్ ఇంటలిజెన్స్ సర్వీస్‌గా మారింది. ప్రధానమంత్రి పదవిలోకి రాకముందే ఆయన దీన్ని స్థాపించారు. పార్క్ చుంగ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు
1971ా75 కాలంలో, కిమ్ డే జంగ్ అధ్యక్షుడిగా ఉన్న 1998ా2000 సమయంలో కిమ్ జోంగ్ పిల్ ప్రధానిగా పనిచేశారు.