ధగధగలాడిన దలాల్‌ స్ట్రీట్‌

– భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
ముంబయి, జులై12(జ‌నం సాక్షి) : దలాల్‌స్ట్రీట్‌ కళకళలాడింది. అంతర్జాతీయ సంకేతాలతో పాటు దేశీయ పరిణామాలపై సానుకూలంగా ఉన్న మదుపర్లు గురువారం నాటి ట్రేడింగ్‌లో కొనుగోళ్ల బాటపట్టారు. దీంతో మార్కెట్‌ ఆరంభం నుంచే జోరువిూదున్న సూచీలు రికార్డు స్థాయిలో ముగిశాయి. సెన్సెక్స్‌ 280 పాయింట్లకు పైగా లాభపడి జీవనకాల గరిష్ఠానికి చేరగా.. నిఫ్టీ మళ్లీ 11వేల మార్క్‌ను దాటింది.
బ్యాంకింగ్‌, రిలయన్స్‌ షేర్ల దన్నుతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 150 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్‌ ఒక దశలో 400 పాయింట్లకు పైగా లాభపడింది. చివరకు 282 పాయింట్లు ఎగబాకి 36,548 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిని తాకింది. అటు నిఫ్టీ కూడా 75 పాయింట్ల లాభంతో 11,023 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.59గా కొనసాగుతోంది.  ఇదిలా ఉంటే గురువారం నాటి మార్కెట్‌ ట్రేడింగ్‌లో ప్రముఖ సంస్థ రిలయన్స్‌ ఇండస్టీస్ర్‌ షేర్లు దూసుకెళ్లాయి. ఇటీవల జరిగిన ఏజీఎం సమావేశంలో నేపథ్యంలో షేరు ధర 52 వారాల
గరిష్ఠానికి పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ మళ్లీ 100 బిలియన్‌ డాలర్లను తాకింది. నేటి ట్రేడింగ్‌లో రిలయన్స్‌ షేరు రెండు ఎక్స్ఛేంజీల్లోనూ ధర 4శాతానికి పైగా లాభపడింది. ఇక ఎన్‌ఎస్‌ఈలో భారత్‌ పెట్రోలియం, బజాజ్‌ ్గ/నాన్స్‌, విప్రో షేర్లు లాభపడగా.. యూపీఎల్‌ లిమిటెడ్‌, వేదాంతా లిమిటెడ్‌, బజాజ్‌ ఆటో, ఇన్ఫోసిస్‌, గ్రాసిమ్‌ షేర్లు నష్టపోయాయి.