ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
ఏపీలో విజయవాడ, గుంటూరు, విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ అనే వ్యాధి కలకలం రేపుతోంది. నెలల శిశువుల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులు ఈ వ్యాధితో ఎక్కువగా బాధపడు తున్నారు. ‘కాక్సీకీ’ అనే వైరస్ ద్వారా వచ్చే ఈ వ్యాధి ప్రాణాంతకం కాదని డాక్టర్లు చెబుతున్నారు. జ్వరం, తలనొప్పి, జలుబు, చేతులు, కాళ్లు, ముఖం, నోటిలో పుండ్లు, దద్దుర్లు, మంట వంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలో డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.