ధరణిపై అవగాహన సదస్సు ధర్మపురి తహశీల్దార్: వెంకటేష్.
ధర్మపురి సెప్టెంబర్ 27( జనం సాక్షి న్యూస్) జగిత్యాల జిల్లా ధర్మపురి మండల ప్రజా పరిషత్ వేదికగా తహశీల్దార్ వెంకటేష్ ధరణి లో ఉన్నటువంటి అపోహలను తొలగిస్తూ, కొత్త రెవెన్యూ చట్టం..! ఇప్పుడు తెలంగాణ అంతటా దీని గురించే చర్చ జరుగుతోంది. కొత్త చట్టంలో ఏముంది? తమ సమస్యలు ఎలా తీరుతాయి? అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయేతర భూములను ఎలా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేస్తారో మండల పరిషత్ వేదికగా వివరించారు తహశీల్దార్ వెంకటేష్,, మాట్లాడుతూ 33 రకాల రెవెన్యూ సేవలు ఆన్లైన్లో పొందుపరిచి ఉన్నాయని, ఫీల్డ్ మీద కు అధికారులు వస్తారని ఆయన వివరిస్తూ, మ్యుటేషన్ / వారసత్వ భూ సంభాషణ / నాలా
వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం ల్యాండ్ వాల్యుయేషన్ సర్టిఫికేట్ (నమోదు సేవలు:)
సర్టిఫైడ్ కాపీ డ్యూటీ మరియు ఫీజు కాలిక్యులేటర్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఎన్కంబరెన్స్ శోధన
రిజిస్ట్రేషన్ సేవల చెల్లింపు
పబ్లిక్ డేటా ఎంట్రీ స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుందన్నారు, కుటుంబ సభ్యులంతా కలిసి ఎమ్మార్వో స్లాట్ బుక్ చేసుకోవాలి. అనంతరం వారందరి ముందే భూముల బదలాయింపు జరుగుతుంది. సర్వే జరిగే సమయంలో.. ప్రతి ఒక్కరు తమ ఫ్యామిలీ వివరాలను అధికారులకు సమర్పించాలి.ఆ వివరాల ఆధారంగా కుటుంబ సభ్యుల పేర్లను కూడా పాస్‌బుక్‌లో నమోదు చేస్తారు.ఎవ్వరికీ ఒక్కరూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని తహశీల్దార్ వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి,ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు,జెడ్పిటిసి బత్తిని అరుణ,మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సతేమ్మ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్, మరియు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు రైతులు తదితరులు పాల్గొన్నారు.